Star Heroine: రూ.500 కోసం హోటల్‌లో పనిచేసిన స్టార్ హీరోయిన్.. నేడు ఆమె సంపాదన కొన్ని కోట్లు..!
Samantha Ruth Prabhu: సినిమా ఇండస్ట్రీ అంటేనే పుకార్లు కామన్. అయితే, వారు స్టార్‌డం సంపాదించిన తర్వాత ఒక విధంగా ఉంటే.. ఆ స్థాయికి వారు చేరుకోవడానికి వారి జీవితం మరో విధంగా ఉంటుంది.

Star Heroine: రూ.500 కోసం హోటల్‌లో పనిచేసిన స్టార్ హీరోయిన్.. నేడు ఆమె సంపాదన కొన్ని కోట్లు..!
Samantha Ruth Prabhu: సినిమా ఇండస్ట్రీ అంటేనే పుకార్లు కామన్. అయితే, వారు స్టార్‌డం సంపాదించిన తర్వాత ఒక విధంగా ఉంటే.. ఆ స్థాయికి వారు చేరుకోవడానికి వారి జీవితం మరో విధంగా ఉంటుంది.
రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్క నటుడి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. స్టార్‌డం వచ్చినపుడు ఒకలా ఉంటే వారు ఈ స్థాయికి చేరుకోవడానికి పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరోయిన్ కూడా రూ.500 కోసం హోటల్‌లో ఎన్నో ఏళ్లు పని చేసిందట.కానీ ఇప్పుడు ఈ ప్యాన్ ఇండియా స్టార్ కొన్ని కోట్ల సంపాదన ఆమె సొంతం.
చిత్ర పరిశ్రమలో నటీనటులది ఎంతో కష్టపడితే మాత్రం ఆ స్థాయికి చేరుకోరు. స్టార్ అయ్యే వరకు వాళ్ళు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక ప్యాన్ ఇండియా లెవెల్ స్టార్ డం సంపాదించిన సమంతా రూత్ ప్రభు జీవితం కూడా అంతే. ఈ స్థాయికి చేరుకోనే ముందు తను పడిన కష్టాలు ఎన్నో. కేవలం రూ.500 కోసం హోటల్ లో పనిచేసేదట. ప్రస్తుతం అన్ని దక్షిణాది సినిమాలతోపాటు హిందీలో కూడా నటించి ప్యాన్ ఇండియా స్టార్ అయింది.
ఒకానొక సమయంలో రెండు పూటలా తినడానికి తిండికి కూడా డబ్బులు సరిగా ఉండేవి కావట. ఈ నేపథ్యంలో చదువు పూర్తయిన తర్వాత హోటల్‌లో హోస్ట్‌గా పనిచేస్తూ రూ. 500 సంపాదించేదట. సమంత 8 గంటలు పని చేస్తే వచ్చే ఆదాయం రూ. 500. ఆ తర్వాత చదువు పూర్తి చేసిన వెంటనే సమంత మోడలింగ్ వైపు వచ్చింది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె 20 ఏళ్ల వయసులోనే హోటల్లో పనిచేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మొదటిసారి తాను పని చేసినప్పుడు 11వ తరగతి చదువుతున్నప్పుడు హోస్టుగా ఆమెకి కేవలం రూ.10 మాత్రమే వచ్చేదట. ఆ తర్వాత 8 గంటల పాటు పనిచేస్తే రూ. 500 వచ్చాయట. ఇక మోడల్‌గా మారిన తర్వాత తను హీరోయిన్ అవకాశాలు అందిపుచ్చుకుంది. అప్పటి నుంచి ఆమె జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా ప్రారంభమైన తన జీవితం పుష్ప సినిమాలో ఏకంగా మూడు నిమిషాల పాటకు ఆమె రూ.5 కోట్ల పారితోషికం కూడా తీసుకుంది. అలా సమంత ఆస్తులు ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇదంతా సామ్ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం సామ్ 'బ్లడ్ యూనివర్స్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.