OTT: ఓటీటీలోకి నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
OTT: ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ తర్వాత యంగ్ హీరో నితిన్, గ్లామర్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'రాబిన్ హుడ్'. 'ఛలో', 'భీష్మ' సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు సంపాదించిన వెంకీ కుడుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

OTT: ఓటీటీలోకి నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
OTT: ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ తర్వాత యంగ్ హీరో నితిన్, గ్లామర్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'రాబిన్ హుడ్'. 'ఛలో', 'భీష్మ' సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు సంపాదించిన వెంకీ కుడుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది.
ఈ సినిమా పైన విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడాయి. మార్చి 28న ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు మంచి వసూలు రాబట్టినా ఆ తర్వాత అదే జోరును మాత్రం కొనసాగించలేకపోయిందని చెప్పాలి. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు బాగున్నా, నితిన్-శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకున్నా.. కథలో కొత్తదనం లేకపోవడం, కథ అంతా తెలిసిందే కావడంతో ప్రేక్షకులను నిరాశపరిచింది.
అంతేకాదు, డేవిడ్ వార్నర్ పాత్రను చాలా చిన్నదిగా చూపించడంతో, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇలా రకరకాల కారణాలతో రాబిన్ హుడ్ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే థియేటర్లలో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ZEE5 ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను పొందింది. ఈ సినిమా మే 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.