Upendra: ఉపేంద్ర కూతురును ఎప్పుడైనా చూశారా.? హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ లేదుగా

Upendra: రియల్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Update: 2025-04-20 10:00 GMT
Upendra

Upendra: ఉపేంద్ర కూతురును ఎప్పుడైనా చూశారా.? హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ లేదుగా

  • whatsapp icon

Upendra: రియల్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే ఉపేంద్ర ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన కూమార్తె పుట్టిన రోజును పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

రియల్ స్టార్ ఉపేంద్ర, నటి ప్రియాంక ఉపేంద్రల కుమార్తె ఐశ్వర్య ఉపేంద్ర పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో ప్రత్యేక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి ప్రియాంక తన కూతురికి “హ్యాపీ బర్త్‌డే బేబీ, ఎప్పుడూ నిన్ను నీవు నమ్ము.. ఐ లవ్ యు” అంటూ ప్రేమతో కూడిన సందేశం షేర్ చేస్తూ, ఐశ్వర్య తాజా ఫోటోలను పోస్ట్ చేశారు. ఫొటోల్లో స్కై బ్లూ బాడీకాన్ డ్రెస్‌లో ఐశ్వర్య స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపించింది. చేతిలో పసుపు గులాబీల బొకే పట్టుకొని చిరునవ్వుతో ముద్దుగా దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లైక్ ల వర్షం కురిపిస్తున్నారు.

మీడియాకు దూరంగా ఉండే ఐశ్వర్యను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఉపేంద్ర కూతురు అచ్చంగా హీరోయిన్ లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య బెంగళూరులోని ప్రముఖ వ్యాలీ స్కూల్‌లో చదువుకుంది. సాధారణంగా సినీ తారల పిల్లలు తమ పిల్లలను సినిమాల్లోకి రావాలని కోరుకుంటారు. కానీ ఉపేంద్ర-ప్రియాంక కపుల్ మాత్రం పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. డిగ్రీ పూర్తయ్యాక మాస్టర్స్ చేయాలన్నది వారి అభిలాష.

అయితే, చదువుతో పాటు ఐశ్వర్యకు నటనపైనా ఆసక్తి ఉంది. ఇప్పటికే 2019లో తల్లి ప్రియాంకతో కలిసి ‘దేవకీ’ అనే చిత్రంలో నటించి తెరంగేట్రం చేసింది. ఈ సినిమా కన్నడ, తమిళ భాషల్లో విడుదలైంది. అయితే, ఐశ్వర్య నటనకు పరిమితంగా ఆగక.. జర్నలిజం రంగంపైనా ఆసక్తి కనబరుస్తోంది. “న్యాయానికి అండగా నిలవాలనుంది, సత్యాన్ని చెప్పే వృత్తిలో ఉండాలనుంది” అని చెప్పిన ఆమె, జర్నలిస్టుగా మారాలని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News