Anupama Parameswaran: తనకంటే 2 ఏళ్లు చిన్నవాడైన ఆ బడా హీరో కొడుకుతో డేటింగ్‌.. అనుపమ లిప్ లాక్ ఫోటో వైరల్ ..

Anupama Parameswaran Dating Rumours: తాజాగా 'పరదా' సినిమా టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్న అనుపమ. ప్రస్తుతం ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Update: 2025-04-13 14:15 GMT
Anupama Parameswaran: తనకంటే 2 ఏళ్లు చిన్నవాడైన ఆ బడా హీరో కొడుకుతో డేటింగ్‌.. అనుపమ లిప్ లాక్ ఫోటో వైరల్ ..
  • whatsapp icon

Anupama Parameswaran Dating Rumours: అ.. ఆ.. సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిపోయింది అనుపమ పరమేశ్వరన్‌. తెలుగులో అనేక పెద్ద సినిమాల్లో కూడా నటించింది. అయితే తాజాగా అనుపమ కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

రింగు రింగుల జుట్టుతో అందరినీ ఆకర్షించే మలయాళ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె డేటింగ్‌లో ఉందనే ర్యూమర్స్‌ వైరల్ అవుతున్నాయి. అ, ఆ సినిమా తర్వాత 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమకోసమే', ' కార్తికేయ2' బడా చిత్రాల్లో నటించిన అనుపమ పరమేశ్వరన్ కు ప్రస్తుతం తెలుగు సినిమాలో ఆఫర్లు తక్కువే అని చెప్పొచ్చు. చివరగా టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది. అప్పటి వరకు ఫ్యామిలీ పాత్రలకు పరిమితమైన అనుపమ పరమేశ్వరన్‌ ఈ సినిమాలో కుర్రకారును కిర్రెక్కించేలా నటించింది. ఈ సినిమాలో అనుపమ నటన మరో లెవల్ అని చెప్పాలి .

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి భలే కలెక్షన్లు కూడా కురిపించింది. ఆ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించారు. అయితే తాజాగా అనుపమ విక్రమ్ కొడుకు అయినా చియాన్ ధృవతో కలిసి 'బైసన్' అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది. ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయక. అయితే తాజాగా వీళ్ళకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఇద్దరూ కలిసి లిప్‌ లాక్‌ చేస్తున్న ఫోటో ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి .

అయితే ఆ ఫోటో చూసి అందరూ నిజమే అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే చియాన్ ధ్రువకి అనుపమ పరమేశ్వరన్‌కు వయస్సులో రెండేళ్ల తేడా. అనుపమనే పెద్ద అని చెప్పుకోవచ్చు. ఇలా అనుపమ పరమేశ్వరన్‌ తనకంటే రెండేళ్లు చిన్న వాడితో డేటింగ్ లో ఉందనే పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News