Pawan Kalyan: మార్క్ శంకర్ తో భారత్ కు తిరిగొచ్చిన పవన్ ఫ్యామిలీ..వైరల్ వీడియో

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రెండవ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడటంతో సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ గాయాల నుంచి కోలుకున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యామిలీ కొన్ని రోజుల పాటు ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. మార్క్ శంకర్ తోపాటు ఆయన భార్యను తీసుకుని పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు చేరుకన్నారు.
పవన్ తన కొడుకును భుజాలపై మోసుకుంటూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ తోపాటు ఆయన భార్య, కుమార్తె కూడా ఉన్నారు. కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. కాగా అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవ, ఆయన సతీమణీ సురేఖ కూడా సింగపూర్ వెళ్లారు. ఇప్పుడు మార్క్ శంకర్ కోలుకున్నాడు. పవన్ తన పరిపాలన పనుల్లో బిజీగా మారే అవకాశం ఉంది.