Kajal Aggarwal: ఆ ఇద్దరు హీరోలతో కాజల్ ఎందుకు నటించలేదు.? అసలు కారణం ఏంటంటే

Kajal Aggarwal: కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అందాల భామ, వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది.

Update: 2025-04-14 13:56 GMT
Kajal Aggarwal

Kajal Aggarwal: ఆ ఇద్దరు హీరోలతో కాజల్ ఎందుకు నటించలేదు.? అసలు కారణం ఏంటంటే

  • whatsapp icon

Kajal Aggarwal: కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అందాల భామ, వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. టాప్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుందీ బ్యూటీ. అటు సీనియర్ హీరోలు, ఇటు జూనియర్‌ హీరోల సరసన నటించింది.

అయితే ఈ బ్యూటీ, ఒక్క నాగార్జునతో మాత్రం ఇప్పటివరకు నటించలేదు. ఆమె ఎందుకు నాగార్జున సినిమాలు చేయలేకపోయిందో ఇప్పుడు చూద్దాం.

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌లలో ఒకరు. ‘మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఒక్కొక్కటీ వదలకుండా సినిమాలు చేస్తూ ఓ వెలుగు వెలిగింది. మిడిల్ రేంజ్ హీరోల నుంచి టాప్ హీరోల వరకు చాలామందితో జతకట్టింది.

పెళ్లికి ముందు వరుస సినిమాల్లో నటించిన కాజల్, పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ నాగార్జున, వెంకటేష్ లతో మాత్రం ఇప్పటికీ కలిసి పనిచేయలేకపోయింది.

వెంకటేష్ సినిమాల్లో ఆమెకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. కానీ నాగార్జునతో మాత్రం రెండు సార్లు అవకాశం వచ్చినా, కాజల్ వాటిని వదులుకుంది. ‘రగడ’ సినిమాలో కాజల్ నటించాల్సి ఉండేది. కానీ చివరి నిమిషంలో ఆమె నుంచి "నో" చెప్పిందట. అదే విధంగా ‘ది గోస్ట్’ మూవీకి కూడా ఆమెకు ఛాన్స్ వచ్చిందని, కానీ ఆ అవకాశం కూడా కాజల్ వదులుకుందని సమాచారం.

ఈ రెండు అవకాశాల విషయంలో ఆమె కథ నచ్చకపోవడం వల్లే సినిమాలు చేయలేకపోయానని చెప్పినట్టు నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇలా ఇప్పటివరకు కాజల్-నాగార్జున కాంబినేషన్ సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు మాత్రం ఎప్పటికైనా వీరిద్దరూ కలిసి కనిపిస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News