మహా కుంభమేళా మోనాలిసాకు ఛాన్స్ ఇస్తానన్న డైరెక్టర్ రేప్ కేసులో అరెస్ట్

Update: 2025-03-31 12:23 GMT

మహా కుంభమేళా మోనాలిసాకు ఛాన్స్ ఇస్తానన్న డైరెక్టర్ రేప్ కేసులో అరెస్ట్

Director Sanoj Kumar Mishra arrested in rape case: మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఒక యువతి పెద్దపెద్ద కళ్లతో అందంగా కనిపించిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు, వీడియోలు ఆమెను ఓవర్ నైట్‌లోనే సోషల్ మీడియా సెన్సేషన్ చేసేశాయి. ఒక్క సినిమా కూడా చేయకుండానే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది.

అదే సమయంలో సనోజ్ కుమార్ మిశ్రా అనే డైరెక్టర్ ఆమెకు తను డైరెక్ట్ చేయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించారు. సనోజ్ మిశ్రా చేసిన ఆ ప్రకటన ఇద్దరికీ విన్ విన్ సిచ్వేషన్‌లా నిలిచింది. ఎందుకంటే అంతకంటే ముందు చాలా కాలంగా లైమ్ లైట్‌లో లేని ఆ డైరెక్టర్‌ కూడా మోనాలిసాకు అవకాశం ఇస్తానన్న ప్రకటనతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఒక రేప్ కేసులో అరెస్ట్ అయి ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ రేప్ కేసుకు మోనాలిసాకు ఎటువంటి సంబంధం లేదు. మరో ఇచ్చిన మహిళ ఫిర్యాదు మేరకు ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

"బాధితురాలి వయస్సు 28 ఏళ్లు. ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ ఆమె స్వస్థలం. 2020 టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా డైరెక్టర్ సనోజ్ మిశ్రా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఆయనే తనను కలవాల్సిందిగా బలవంతం చేశారు. లేదంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరించారు. దాంతో చేసేదేం లేక వెళ్లి కలిశాను. 2021, జూన్ 18న ఆయన నన్ను ఒక రిసార్ట్‌కు తీసుకెళ్లారు. డ్రగ్స్ ఇచ్చి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు" అని బాధితురాలు వాపోయారు.

తనపై లైంగిక దాడి చేసిన సమయంలో తనను అభ్యంతరకరమైన రీతిలో ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తనతో సంబంధం పెట్టుకోవాలని, లేదంటే ఆ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించారు. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకుని సినిమా అవకాశాలు ఇస్తానని కూడా నమ్మించి ముంబైలో తనతో కలిసి సహ జీవనం చేశారు" అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ముంబైలో సహ జీవనం చేసేటప్పుడు అనేకసార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడుసార్లు బలవంతంగా అబార్షన్ కూడా చేయించారు. ఇదేంటని ప్రశ్నించినందుకు గత ఫిబ్రవరి నుండి తనను వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించారు" అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు, సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. బాధితురాలి నుండి సెక్షన్ 164 CrPC కింద వాంగ్మూలం తీసుకున్నారు. అత్యాచారం, లైంగిక వేధింపులు, బలవంతంగా అబార్షన్ చేయించడం, మహిళను మోసం చేయడం వంటి అభియోగాలు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో బాధితురాలికి అబార్షన్ చేయించినట్లుగా ఉన్న మెడికల్ ఎవిడెన్స్ కూడా సేకరించారు.

ఈ అరెస్ట్ బారి నుండి తప్పించుకునేందుకు సనోజ్ మిశ్రా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, ఢిల్లీ హై కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఏదేమైనా మోనాలిసాను ఇంకా స్క్రీన్‌పై చూపించకుండానే సనోజ్ మిశ్రా ఇలా ఈ రేప్ కేసుతో మరోసారి వార్తల్లోకొచ్చారు.

Tags:    

Similar News