Nani: క్రేజీ కాంబినేషన్‌.. హిట్‌3లో నానితో పాటు ఆ స్టార్‌ హీరో.?

Nani: న్యాచురల్‌ స్టార్‌ నాని 'హిట్‌: ది థర్డ్‌ కేస్‌' (Hit 3) పేరుతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2025-04-04 07:27 GMT
Nani: క్రేజీ కాంబినేషన్‌.. హిట్‌3లో నానితో పాటు ఆ స్టార్‌ హీరో.?
  • whatsapp icon

Nani: న్యాచురల్‌ స్టార్‌ నాని 'హిట్‌: ది థర్డ్‌ కేస్‌' (Hit 3) పేరుతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 'హిట్‌' ఫ్రాంచైజీలో ఇది మూడో భాగం. మొదటి రెండు భాగాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాక, బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ కొట్టాయి.

ఈ సిరీస్‌ను రూపొందిస్తున్న దర్శకుడు శైలేశ్ కొలను మళ్ళీ మరో సాలిడ్ కథతో మూడో పార్ట్‌ను తెరకెక్కించాడని చిత్ర యూనిట్ చెబుతోంది. వాల్‌ పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో 'కెజీఎఫ్‌' ఫేమ్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అడివి శేష్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తాజా సమాచారం‌ ప్రకారం ఈ సినిమా తమిళ హీరో కార్తి ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆయన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో హిట్‌4లో కార్తీ హీరోగా కనిపించనున్నారా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే గత చిత్రాల్లో కూడా దర్శకుడు క్లైమాక్స్‌లో వచ్చే అతిథి పాత్రతోనే తదుపరి భాగాన్ని అనౌన్స్‌ చేశారు. అదే ఫార్ములా ఈసారి కూడా పునరావృతమవుతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కాగా కార్తి పోలీస్‌ పాత్రలో ఇది వరకు పలుసార్లు అలరించిన విషయం తెలిసిందే. ఖాకీ సినిమాలో అద్భుత నటనను కనబరిచారు. ఇక హిట్‌3 విషయానికొస్తే నాని ఇందులో "అర్జున్‌ సర్కార్‌" అనే గట్టి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌ సినిమా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌లా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాయి. సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్న మిక్కీ జె. మేయర్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది. ఈ మే 1న థియేటర్లలో రిలీజ్ అవుతున్న 'హిట్‌ 3'తో పాటు, ‘హిట్‌ 4’పై కార్తి ఎంట్రీ కన్‌ఫర్మ్ అవుతుందా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News