సన్నగా మారిన ఎన్టీఆర్.. వారికి నేను సలహాలు ఇస్తానా? అంటూ కళ్యాణ్ రామ్ కామెడీ

సన్నగా మారిన ఎన్టీఆర్.. వారికి నేను సలహాలు ఇస్తానా? అంటూ కళ్యాణ్ రామ్ కామెడీ
Kalyan Ram about NTR's lean personality: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సన్నగా మారిన ఫోటోలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ లేటెస్ట్ గెటప్ చూసి అభిమానులే షాక్ అవుతున్నారు. దీంతో తారక్ అభిమానుల్లో ఇదొక హాట్ టాపిక్ అయింది. ఇదే విషయమై తాజాగా కళ్యాణ్ రామ్ కూడా స్పందించక తప్పలేదు.
కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ S/O వైజయంతి సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కళ్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో కనిపించనున్నారు. తల్లీ-కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన సినిమా ఇది.
అర్జున్ S/O వైజయంతి మూవీ రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఆ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఎన్టీఆర్ ఎందుకంత సన్నగా అయ్యారు, ఆయన సన్నగా అయ్యేందుకు మీరు ఏమైనా ట్రైనింగ్ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు కళ్యాణ్ రామ్ స్పందిస్తూ, "ఎన్టీఆర్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగాడు అని అన్నారు. ఆయన మార్కెట్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఉంది. ప్యాన్ ఇండియా లెవెల్లో టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ ఇద్దరికీ నేను సలహాలు ఇస్తానా" అని నవ్వుతూ బదులిచ్చారు. ఎన్టీఆర్ అయినా, తానయినా ఏం చేసినా సినిమా కోసమే చేస్తామని, తన తమ్ముడు ఎన్టీఆర్ సన్నగా అవడం కూడా అందులో భాగమేనని చెప్పకనే చెప్పారు.
Arjun Son Of Vyjayanthi Trailer - అర్జున్ S/O వైజయంతి ట్రైలర్
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర -1 మూవీ తరువాత ఆయన వార్-2 సినిమాలో నటిస్తున్నారు. అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న వార్-2 మూవీలో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్, జాన్ అబ్రహం, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 22 నుండి ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా షూటింగ్‌కు ఎన్టీఆర్ (NTR's next movies) అటెండ్ అవనున్నారు.