Ilaiyaraaja: మైత్రీ మూవీస్‌కు ఇలయరాజా నోటీసులు.. రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ

Ilaiyaraaja: టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.

Update: 2025-04-15 12:10 GMT
Ilaiyaraaja

Ilaiyaraaja: మైత్రీ మూవీస్‌కు ఇలయరాజా నోటీసులు.. రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ

  • whatsapp icon

Ilaiyaraaja: టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థ నిర్మించిన తొలి తమిళ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో, ఆదిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ ఏప్రిల్ 10న విడుదలై, విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అయితే ఈ సినిమాతో సంబంధించి ఇప్పుడు ఓ సమస్య మైత్రీ మూవీ మేకర్స్‌ను కలవరపెడుతోంది. చిత్రంలో ఇళయరాజా సంగీతం అందించిన పాత తమిళ పాటల్ని రీమిక్స్ చేసి కొన్ని సన్నివేశాల్లో వాడారు. థియేటర్లలో ఆ పాటల సీన్స్‌కి ప్రేక్షకులు విపరీతంగా స్పందిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఈ పాటలను అనుమతి లేకుండా వాడినందుకు ఇళయరాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో నోటీసులు జారీ చేసిన ఇళయరాజా, తన స్వరపరిచిన మూడు పాటలను అక్రమంగా వాడారని ఆరోపిస్తూ నిర్మాణ సంస్థకు రూ. ఐదు కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. అదే కాకుండా, సంబంధిత పాటలను వెంటనే చిత్రంలో నుంచి తొలగించాలని, అలాగే చిత్రబృందం ఏడు రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఇది మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి.

Tags:    

Similar News