Pushpa 3: ఇదెక్కడి మాస్ రా మామా.? పుష్ప3లో నాని, విజయ్ దేవరకొండ
Pushpa 3: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Pushpa 3: ఇదెక్కడి మాస్ రా మామా.? పుష్ప3లో నాని, విజయ్ దేవరకొండ
Pushpa 3: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే పుష్ప నుంచి మరో సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. పుష్ప3 చిత్రం కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
2026లో షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, సినిమా కథ, క్యాస్టింగ్‌పై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప3ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో స్టార్ హీరోలను భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, న్యాచురల్ స్టార్ నానీ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇటీవల ఓ కాలేజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు సుకుమార్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ‘పుష్ప 3’లో నిజంగా విజయ్ దేవరకొండ, నాని నటిస్తున్నారా?’ అని అడిగితే, ఆయన తెలివిగా స్పందిస్తూ "2025లో దీనికి సమాధానం చెప్పలేను, 2026లో తెలుస్తుంది" అని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ చివర్లో విలన్ ఎంట్రీని టీజర్‌లా చూపించిన మేకర్స్, అతని ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. కథ ప్రకారం, పుష్ప రాజ్‌ను చంపేందుకు ఒక బాంబు ప్లాన్ చేస్తారు. డిటోనేటర్ నొక్కిన దృశ్యం మాత్రమే చూపించి, అది ఎవరు చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించరు.
ఈ మిస్టరీ ‘పుష్ప 3’లో క్లియర్ అవుతుంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ అనంతరం సుకుమార్, విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ తాజా ప్రచారం ప్రకారం, ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి, విజయ్‌తో ‘పుష్ప 3’లో విలన్‌గా నటించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం? నాని, విజయ్ ఇద్దరూ విలన్లుగా కనిపిస్తారా? లేదా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. మొత్తం మీద ఇంకా షూటింగ్ కూడా ప్రారంభంకాక ముందే పుష్ప3 సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.