Keerthy Suresh: లిప్‌లాక్ ఉందని సినిమా వదులుకున్న కీర్తి సురేశ్.. ఇంతకీ ఏంటా మూవీ?
Keerthy Suresh: కీర్తి సురేష్.. ఈ పేరును సగటు సినీ లవర్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Keerthy Suresh: లిప్‌లాక్ ఉందని సినిమా వదులుకున్న కీర్తి సురేశ్.. ఇంతకీ ఏంటా మూవీ?
Keerthy Suresh: కీర్తి సురేష్.. ఈ పేరును సగటు సినీ లవర్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుందీ చిన్నది. మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును గెలుచుకున్న కీర్తి సురేశ్ ప్రస్తుతం బాలీవుడ్‌పై తన దృష్టి సారించింది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పాటు సమానంగా బాలీవుడ్‌లోనూ రాణిస్తోంది.
ఇటీవలే కీర్తి బేబీ జాన్ అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, కీర్తి సురేష్‌కు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా, రణవీర్ సింగ్ నటిస్తున్న ఓ భారీ ప్రాజెక్ట్‌లో కీర్తిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో హాట్ టాపిక్‌గా మారిన కీర్తి, కెరీర్ ప్రారంభంలో మాత్రం పాత్రల ఎంపిక విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునేందంటా. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిప్‌లాక్ సన్నివేశం ఉందన్న కారణంతో కీర్తి ఏకంగా సినిమాను వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా మరేదో కాదు 2021లో విడుదలైన మాస్ట్రో సినిమా. నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం తొలుత కీర్తిని కథానాయికగా ఎంపిక చేశారు. అయితే సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉందన్న కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ నితిన్‌తో రంగ్‌దే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కీర్తి, నితిన్‌లు మంచి స్నేహితులుగా మారారు. ఇక కీర్తీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ.. రఘుతాత, రివాల్వర్ రీటా వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తోంది. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.