Viral Video: కోలీవుడ్ హీరోలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మీరూ చూడండి.. వీడియో

Kollywood Icons AI Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు కంటెంట్ క్రియేటర్లు. కొన్ని వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలానే కోలివుడ్ హీరోలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ కు సంబంధించిన ఓ వీడియో జయ్ అనే డిజిటల్ ఆర్టిస్ట్ క్రియేట్ చేశాడు.
ఆ నటులు తమ చిన్నప్పుడు ఎలా ఉండేవారో చూపిస్తూనే వారిని వారే ఎత్తుకుంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ దానికి ఏఐ వీడియో రూపం ఇచ్చాడు. ఈ వీడియో 25లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కమల్ హాసన్ చిన్నప్పటి సినిమా చాలా క్యూట్ గా ఉందంటూ పొగుడుతున్నారు. మరికొందరు తమ అభిమాన నటులపై ఉన్న ప్రేమను లైకులు, కామెంట్ల రూపంల్ చూపిస్తున్నారు.