Actress: ఆ హీరోయిన్‌తో నన్ను పోల్చడం నచ్చలేదు.. షాలిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షాలిని పాండే. తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుందీ బ్యూటీ.

Actress: ఆ హీరోయిన్‌తో నన్ను పోల్చడం నచ్చలేదు.. షాలిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షాలిని పాండే. తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుందీ బ్యూటీ. ఈ సినిమాలో తన అందం, నటనతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఫస్ట్ మూవీ భారీ హిట్ అయినా, ఆ తర్వాత సినిమాల్లో ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో బాలీవుడ్‌పై దృష్టి సారించింది.
ఇటీవలే ఆమె హిందీ వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో షబానా అజ్మీ, జ్యోతిక కీలక పాత్రల్లో నటించగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీలో పలు అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది షాలిని.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు తనను బాలీవుడ్ స్టార్ అలియా భట్‌తో పోలుస్తూ అభిప్రాయాలు వెల్లడిస్తుండటంపై ఆమె స్పందించింది. ఈ విషయమై మాట్లాడుతూ.. 'ప్రేక్షకుల ప్రేమాభిమానాలు నాకు ఎంతో విలువైనవి. అయితే, నన్ను అలియా భట్‌తో పోల్చడం మాత్రం నచ్చదు. ఇండస్ట్రీకి ఇప్పటికే అలియా భట్ ఉన్నారు. ఆమె అద్భుతమైన నటి. తన కెరీర్‌ను, నటనను గౌరవిస్తాను. అయితే, నా ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతున్నా. నన్ను నా పేరుతోనే గుర్తిస్తే బావుంటుంది' అని చెప్పుకొచ్చిందీ చిన్నది. షాలినీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.