Divya Bharathi: వారి విడాకులకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. నటి కీలక వ్యాఖ్యలు
Divya Bharathi: సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Divya Bharathi: వారి విడాకులకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. నటి కీలక వ్యాఖ్యలు
Divya Bharathi: సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విడాకులకు కారణం నటి దివ్యభారతి అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన ఆమె, తాజాగా మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసిందీ తార.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దివ్యభారతి పోస్ట్ చేస్తూ.. 'నా పేరు సంబంధం లేని వ్యక్తుల కుటుంబ సమస్యల్లోకి నన్ను లాగుతున్నారు. జీవీ ప్రకాశ్ వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. పెళ్లి అయిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం నా స్వభావం కాదని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆధారాలు లేకుండా నాపై రూమర్స్ సృష్టించడం ఆపండి. నేను ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. కానీ ఈ మితిమీరిన ప్రచారంతో నా పేరు దెబ్బతింటోంది. నిరాధారమైన ఆరోపణలు చేసే బదులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. నా గోప్యతను గౌరవించండి. ఇకపై ఈ విషయంపై మాట్లాడే ఉద్దేశ్యం లేదు. ఇదే నా మొదటి, చివరి స్పందన' అని రాసుకొచ్చింది.
దీంతో దివ్య భారతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే గతంలోనూ జీవీ ప్రకాశ్ విడాకుల నేపథ్యంలో దివ్యభారతి తీవ్ర విమర్శలకు గురయ్యారు. అప్పట్లో కూడా ఆమె ఇదే విధంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. జీవీ ప్రకాశ్‌తో ఆమె ‘కింగ్‌స్టన్’ చిత్రంలో కలిసి నటించగా, ఈ సినిమా విజయవంతమైంది. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడిందని, అది ప్రేమకు దారి తీసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదని, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని దివ్య భారతి అప్పట్లోనే స్పష్టం చేసింది.