Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్‌పై బిగ్ అప్డేట్.. స్పందించిన ప్రభాస్ టీమ్.. ఏం చెప్పిందంటే

Prabhas Marriage: యంగ్ రెబల్ స్టార్..పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి వార్తలు వైరల్ అయ్యాయి. బాహుబలి స్టార్ ప్రభాస్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లిచేసుకుంటున్నట్లు ఈ మధ్య కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. కానీ తాజా అప్ డేట్ లో ఈ ఊహాగానాలపై కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రభాస్ పర్సనల్ టీమ్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. వీటిని ఫేక్ న్యూస్ అని తెలిపింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఫేక్ అయితే అయ్యింది కానీ..ఆ ఊహ ఎంత బాగుందో అంటున్నారు. ఎందుకంటే తన పెళ్లి గురించి ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆయన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా తమకు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా రిపోర్టుల ప్రకారం ప్రభాస్, అనుష్కతో కాకుండా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడని హడావుడి షురూ అయ్యింది. ఈ వార్త వెలుగులోకి వచ్చినప్పుడు అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ప్రభాస్ అనుష్కను కాకుండా మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడా అంటూ ఆలోచించారు. అయితే హిందూస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ పెళ్లి వార్తలు పూర్తిగా ఫేక్ అని ప్రభాస్ టీమ్ తో సంప్రదించినప్పుడు వారు ఇది ఫేక్ న్యూస్ అని పట్టించుకోవద్దని స్పష్టంచేసినట్లు తెలిపింది.
ఇక ప్రభాస్ పెళ్లి గురించి ఈ పుకార్లు కొత్తేమీకాదు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి పుకార్లు చాలా వస్తునే ఉన్నాయి. ఆదిపురుష్ మూవీ సమయంలో కృతి సనన్ తో ఆయన పేరును యాడ్ చేశారు. త్వరలోనే వీరి పెళ్లి అంటూ ఊదరగొట్టారు. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. ఇక ప్రభాస్ అభిమానులు ఆయన పెళ్లి కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఈ తాజా అప్ డేట్ మాత్రం వారిని నిరాశపరిచింది. ప్రభాస్ తన కెరీర్ ను ముందుంచుకుని వ్యక్తిగత జీవితం గురించి రహస్యంగా ఉంచుతున్నారని స్ఫస్టం అవుతోంది.