Viral Video: ఈ హీరోయిన్ కసికసిగా ఉంది.. మాజీ మంత్రి మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్
Mallareddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీస్తున్నాయి. మల్లారెడ్డి కాలేజీలో పని చేసే ప్రిన్నిపల్ కొడుకు హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా మల్లారెడ్డి కాలేజీలో శుక్రవారం ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హాజరయ్యారు. వేదిక మీద మాట్లాడుతూ నోరు జారారు. హీరోయిన్ కసికాపూర్ గురించి పరిచయం చేస్తూ..హీరోయిన్ మాంచి కసికసిగా ఉందంటూ కామెంట్స్ చేశారు.
అంతేకాదు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ కార్యక్రమానికి వచ్చాను అని అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లారెడ్డి హీరోయిన్ పై చేసిన కామెంట్స్, అసెంబ్లీకి డుమ్మా కొట్టి సినిమా ప్రమోషన్ కు వచ్చాను అంటూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.