Mad Square Twitter Review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ..నవ్వించింది ఆ నలుగురేనట

Mad Square Twitter Review: నార్నే నితిన్, సంగీత్ శోభన్,రామ్ నితిన్ కాంబోతో మ్యాడ్ మూవీ తీశారు. అందులో విష్ణు పోషించిన లడ్డు కేరక్టర్ మరింత ఎక్కువ క్లిక్ అయ్యింది. దీంతో ఆ నాలుగు పాత్రలను పెట్టి మ్యాడ్ స్క్వైర్ మూవీ తీశారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అందర్నీ కడుపుబ్బా నవ్వించేసింది. కథ, లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి ఎంజాయ్ చేయండి. ఇందులో స్టోరేమీ ఉండదని ముందు నిర్మాత హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీ మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.
నిర్మాత నాగవంశీ ప్రస్తుతం ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే సినిమాలు నిర్మించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టెల్లు, టిల్లు స్క్వెర్, మ్యాడ్ స్క్వేర్ అంటూ ఇలా ఫ్రాంచైజీలు చేస్తున్నాడు. కథ, కథనం ఇవన్నీ పట్టించుకోకండి. వచ్చి నవ్వి ఎంజాయ్ చేయండి అంటూ ప్రమోషన్స్ లో చెప్పాడు నాగవంశీ. మరి ఇందులో కథ లేదని నిర్మాత ముందుగానే హింట్ ఇచ్చాడు. కామోడీ కోసమే జనాలు థియేటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ కామెడీ వర్కౌట్ అయ్యిందో లేదో చూద్దాం.
మ్యాడ్ స్క్వేర్ సినిమా షోలు స్టార్ట్ అయ్యాయి. పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కానీ అందరూ ఒకే విధమైన ట్వీట్లు చేస్తున్నారు. సినిమా పడి దాదాపు రెండు గంటలు అవుతోంది. ఇప్పటి వరకు బాగుంది. పాజిటివ్ గా ఉంది. మాకు డ్రగ్స్ అవసరం లేదు..పవన్ కల్యాణ్ ఉన్నాడు అనే డైలాగ్ అదిరిపోయిందని అంటున్నారు. ట్వీట్స్ మీరే చూడండి.