Klinkaara: రామ్ చరణ్ గారాలపట్టి క్లింకార ఉగాది సెలబ్రేషన్స్.

Update: 2025-03-31 03:10 GMT

Klinkaara: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2023, జూన్ 20 క్లింకార జన్మించింది. ఆ సమయంలో అభిమానులు పెద్ద పండగే చేుకున్నారు. క్లింకార పుట్టుగానే మెగా ఇంట్లో పట్టలేని సంతోషం కనిపించింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల మొదటి బిడ్డగా, మెగా వారసురాలిగా జన్మించడంతో సంబురాలు అంబరాన్నంటాయి. అయితే క్లింకా పుట్టినప్పటి నుంచి ఆ చిన్నారి ముఖం ఎలా ఉందో చూడాలని మెగా ఫ్యాన్స్ ఆరాటపడుతూనే ఉన్నారు. కానీ క్లింకార ఏ ఫొటో షేర్ చేసినా కూడా అందులో ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే తాజాగా మెగా కోడలు ఉపాసన తన ఇంట్లో ఉగాది పండగలకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఉపాసన క్లింకార సురేఖలు పూజ మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఉంది. అయితే ఇందులో క్లింకార స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చిన్నారిని ముఖం లవ్ ఏమోజీతో కవర్ చేసిన కూడా సైడ్ యాంగిల్ లో కాస్తు కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బేబి పింక్ డ్రెస్ లో పూజలో కూర్చొన్న క్లింకార ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News