Mohan Lal: వివాదాల కేంద్రంగా మారిన మోహన్‌లాల్ మూవీ.. గుజరాత్ అల్లర్లను సినిమాలో చూపించారా?
Mohan Lal: వివాదంలో చిక్కుకున్న ఎంపురాన్ సినిమా నుంచి గుజరాత్ హింసలపై ఉన్న అంశాలను తొలగించనున్నట్లు మోహన్‌లాల్ ప్రకటించాడు. ప్రేక్షకుల భావాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Mohan Lal: వివాదాల కేంద్రంగా మారిన మోహన్‌లాల్ మూవీ.. గుజరాత్ అల్లర్లను సినిమాలో చూపించారా?
Mohan Lal: మోహన్‌లాల్ నటించిన ఎంపురాన్ చిత్రం ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. 2002 గుజరాత్ హింసలు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు చూపించడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై స్పందించిన మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా తన మౌనం వదిలి మన్ననలు కోరాడు. అభిమానులకు మానసికంగా బాధ కలిగినందుకు తాను బాధపడ్డానని, ఏవైనా రాజకీయ సిద్ధాంతాలైనా, మత విశ్వాసాలైనా గౌరవించాల్సిందేనని ఆయన చెప్పారు.
ఎంపురాన్ సినిమా లూసిఫర్ ఫ్రాంచైజీలో రెండో భాగంగా రూపొందింది. ఇందులో పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 27న సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. అయితే, విడుదలైన కొన్ని రోజుల్లోనే సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు, వాస్తవ సంఘటనలకున్న సంబంధంపై నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కొందరు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. తాను నటించిన సినిమాల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నానని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఉన్న కొన్ని రాజకీయ, సామాజిక అంశాలు అభిమానుల హృదయాలను బాధించాయని తెలుసుకున్నానని.. సినిమా నుంచి ఆ విషయాలను తొలగించాలనే నిర్ణయానికి వచ్చామని వివరించాడు. కథకు సంబంధం లేకుండా ప్రేక్షకుల మనోభావాలకు గౌరవం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పాడు.