Reginaa Cassandrra: శేఖర్ కమ్ముల మూవీని వదులుకున్న రెజీనా.. ఆ సినిమా పడి ఉంటేనా?
Reginaa Cassandrra: రెజీనా కసాండ్రా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది.

Reginaa Cassandrra: శేఖర్ కమ్ముల మూవీని వదులుకున్న రెజీనా.. ఆ సినిమా పడి ఉంటేనా?
Reginaa Cassandrra: రెజీనా కసాండ్రా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. తెలుగుతో పాటు సౌత్‌లో పలు సినిమాల్లో నటించి రెజీనా తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్‌ను మాత్రం అందుకోలేకపోయింది.
"శివ మనసులో శ్రుతి" సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ, వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, అనుకున్న స్థాయిలో కెరీర్ గ్రోత్ సాధించలేకపోయింది. అయితే కెరీర్ తొలినాళ్లలో రెజీనా ఓ మంచి ఆఫర్‌ను కోల్పోయిందంట. కెరీర్ ప్రారంభ దశలోనే రెజీనా స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలో నటించే అవకాశం కోల్పోయిందని వార్తలు వచ్చాయి.
"శివ మనసులో శ్రుతి" సినిమాలో ఛాన్స్ దక్కిన సమయంలోనే "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" కోసం కూడా సెలెక్ట్ అయ్యిందట. అయితే రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ కుదరక, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో నటించి ఉంటే టాలీవుడ్‌లో రెజీనా క్రేజ్ మరోలా ఉండేదని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్ పాత్రలో శృతిని అనుకున్నట్లు సమాచారం
ఇక రెజీనా కెరీర్ విషయానికొస్తే ఇటీవల "ఉత్సవం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఓ వైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే సరైన విజయాన్ని అందుకోలేకపోతున్న రెజీనాకు కరెక్ట్ విజయం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.