Vijay Deverakonda: మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రౌడీ హీరో.? ట్యాలెంటెడ్‌ దర్శకుడితో

Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన కెరీర్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Update: 2025-03-28 11:24 GMT

Vijay Deverakonda: మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రౌడీ హీరో.? ట్యాలెంటెడ్‌ దర్శకుడితో

Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన కెరీర్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్ట్‌లను ఫైనల్ చేస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.

ఈ సినిమా పూర్తయ్యాక విజయ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ‘రాజావారు రాణీవారు’ ఫేమ్‌ రవికిరణ్‌ కోలా డైరెక్షన్‌లో కూడా ఓ ప్రాజెక్ట్‌ లైన్‌లో ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు విజయ్‌ మరో టాలెంటెడ్‌ డైరెక్టర్‌తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని ఫిల్మ్‌ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

టాలీవుడ్‌లో విభిన్న కథలను తీసుకుని తనదైన స్టైల్‌లో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’, ‘అష్టాచెమ్మా’, ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో ఆయన తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండకు ఒక ఇంట్రెస్టింగ్‌ కథను వినిపించారని, అది విజయ్‌కు బాగా నచ్చిందని సమాచారం.

ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ టీమ్‌ ఈ కథకు పూర్తి స్థాయిలో బౌండ్‌ స్క్రిప్ట్ సిద్ధం చేస్తోంది. అయితే, ‘కింగ్‌డమ్‌’ తర్వాత విజయ్‌ మొదట రాహుల్‌ సంకృత్యాన్‌ ప్రాజెక్ట్‌పై ఫోకస్‌ చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత రవికిరణ్‌ కోలా లేదా ఇంద్రగంటి మోహనకృష్ణలో ఎవరి స్క్రిప్ట్ రెడీ అవుతుందో, ఎవరు ముందుగా షూటింగ్‌ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారో, వారితో సినిమా చేయనున్నాడని టాక్‌. ఈ ఇద్దరి డైరెక్టర్లలో విజయ్‌ ముందుగా ఎవరి సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడో చూడాలి.

Tags:    

Similar News