Shruti Narayanan: వాళ్లు కూడా అమ్మాయిలే కదా వారి వీడియోలు చూడండి.. నటి సంచలన వ్యాఖ్యలు..
Shruti Narayanan: కోలీవుడ్‌లో ప్రస్తుతం శృతి నారాయణన్ అనే పేరు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Shruti Narayanan: వాళ్లు కూడా అమ్మాయిలే కదా వారి వీడియోలు చూడండి.. నటి సంచలన వ్యాఖ్యలు..
Shruti Narayanan: కోలీవుడ్‌లో ప్రస్తుతం శృతి నారాయణన్ అనే పేరు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్న పాత్రలతో సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె, ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే, ఇటీవల ఆమె పేరుతో ఓ ప్రైవేట్ వీడియో లీక్ అయ్యిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో ఉంది తను కాదని, ఏఐతో రూపొందించారన్న విషయాన్ని తెలుపుతూ ఈ హీరోయిన్ ఓ పోస్ట్ చేసింది.
అయినా వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే శృతి నారాయణ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ విషయమై ఆమె పోస్ట్ చేస్తూ.. 'వైరలవుతున్న వీడియోను షేర్ చేయడం మీకు సరదాగా అనిపిస్తుందేమో, కానీ ఇది నా జీవితం. నాకు, నా కుటుంబానికి ఇది చాలా కఠినమైన పరిస్థితి. నేను కూడా ఒక అమ్మాయినే. నా భావోద్వేగాలను అర్థం చేసుకోండి. దయచేసి ఆ వీడియోను షేర్ చేయకండి. మీకు నిజంగానే ఆసక్తి ఉంటే మీ తల్లి, చెల్లి, ప్రేయసి వీడియోలు చూసుకోండి. వాళ్లూ నా లాగే అమ్మాయిలే. వారి ప్రైవేట్ జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి' అని రాసుకొచ్చారు.
'ఈ వ్యవహారంపై కొందరు నన్నే తప్పుపడుతున్నారు. కానీ, అసలు తప్పు ఆ వీడియోను లీక్ చేసిన వారిది. అలాంటి వీడియోలు చూస్తూ ప్రోత్సహించే వారిది. డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దయచేసి ఈ వ్యవహారాన్ని ఇక ముగించండి. లింకుల కోసం అడగడం మానేయండి. మనుషులుగా ప్రవర్తించండి. లీకైన వీడియోలను షేర్ చేయడం భారతదేశంలో నేరం. అది నిజమైందా, డీప్‌ఫేక్‌వా అన్నదాంతో సంబంధం లేదు. చట్టపరంగా దానికి శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి" అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.