Veera Dheera Soora Review: విక్రమ్ మరోసారి మెప్పించాడా.? వీర ధీర శూర ఎలా ఉంది.?
Veera Dheera Soora Review: తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న హీరోల్లో విక్రమ్ ఒకరు. ఈయన నుంచి కొత్త సినిమా వస్తుందంటే పక్కా పైసా వసూల్ అని ఫ్యాన్స్ ఆశిస్తుంటారు.

Veera Dheera Soora Review: విక్రమ్ మరోసారి మెప్పించాడా.? వీర ధీర శూర ఎలా ఉంది.?
Veera Dheera Soora Review: తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న హీరోల్లో విక్రమ్ ఒకరు. ఈయన నుంచి కొత్త సినిమా వస్తుందంటే పక్కా పైసా వసూల్ అని ఫ్యాన్స్ ఆశిస్తుంటారు. ‘తంగలాన్’ వంటి వైవిధ్యభరితమైన సినిమా తర్వాత విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూర' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తమిళంలో ‘వీర ధీర శూరన్: పార్ట్-2’గా రూపొందించారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది.? సినిమాలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా పేరు: వీర ధీర శూర
నటీనటులు: విక్రమ్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, దుషార విజయన్, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు
సంగీతం: జీవీ ప్రకాశ్
సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
నిర్మాత: రియా శిబు
రచన, దర్శకత్వం: ఎస్‌యూ అరుణ్‌కుమార్
కథేంటంటే:
కాళి (విక్రం) ఓ చిన్న కిరాణా దుకాణం నడుపుతూ, తన భార్య వాణి (దుషారా విజయన్), పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కానీ అతని గతం మామూలుది కాదు. ఒకప్పుడు ఆ ఊరిలో బలమైన ప్రభావం కలిగిన రవి (30 ఇయర్స్ పృథ్వీ)కి అత్యంత నమ్మకమైన అనుచరుడిగా ఉంటూ అనేక గొడవలతో సావాసం చేసేవాడు. కానీ వాటన్నింటినీ వదిలేసి కొత్త జీవితం గడుపుతుంటాడు. అయితే కొన్ని అనుకొని కారణాలతో కాళి తన మునుపటి ప్రపంచంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రవి, తన కొడుకు కన్నా (సూరజ్ వెంజరమూడు)పై పోలీసుల ఎన్‌కౌంటర్ ముప్పు ఉందని, తనను రక్షించాల్సిందిగా కాళిని ఆశ్రయిస్తాడు. ప్రత్యేకంగా ఎస్పీ అరుణగిరి (ఎస్.జె. సూర్య)ను అంతం చేయాలని కోరతాడు. ఈ పరిస్థితి కాళిని మరల మునుపటి జీవితంలోకి లాగడానికి కారణమేమిటి? ఎస్పీ అరుణగిరి, రవిల మధ్య పోరు ఎందుకు మొదలైంది? కాళి ఈ విషయంలో ఎలా ఇరుక్కున్నాడు? చివరకు తన కుటుంబం మీద వచ్చిన ముప్పును ఎదుర్కొని కాళి తీసుకున్న నిర్ణయం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే.?
ఒక రోజు రాత్రి జరిగే కథే ఈ చిత్రం. దర్శకుడు కథను తీసుకెళ్లే విధానం నచ్చుతుంది. ముఖ్యంగా సినిమా కథ, కథనం సాగే విధానం, యాక్షన్ ఘట్టాలు గతంలో వచ్చిన కార్తి ‘ఖైదీ’ సినిమాని గుర్తు చేస్తుంది. అత్యంత సహజంగా తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనీయకుండా చేస్తాయి. రవి కోరిన సాయం చేయడానికి కాళి ఏం చేశాడన్న సన్నివేశాలు బాగుంటాయి. కొన్ని సీన్స్ సినిమాను ఎగ్జైట్‌మెంట్‌గా మార్చేస్తాయి. ఇక ఫ్లాష్‌బ్యాక్‌గా వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా మొదటి పార్ట్ వచ్చిన తర్వాత రెండో పార్ట్ వస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం మొదట రెండో పార్ట్ విడుదలైంది. అంటే ఈ సినిమాకు ప్రీక్వెల్ త్వరలోనే రానుందన్నమాట.
ఎలా నటించారు.?
ఎప్పటిలాగే విక్రమ్ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమాయకంగా కనిపిస్తూనే, కుటుంబం కోసం ఎంతవరకైనా పోరాడే శక్తివంతమైన కాళి పాత్రలో మెప్పించాడు. విక్రమ్ నటన సినిమాకు నేచురల్ లుక్‌ను తీసుకొచ్చాయి. దుషారా విజయన్ కూడా తన పాత్రతో మెప్పించారు. ఇక ఎస్పీ అరుణగిరి పాత్రలో ఎస్.జె.సూర్య అద్భుత నటనను కనబరిచారు. థర్టీ ఇయర్స్ పృథ్వీకి బలమైన పాత్ర ఉంది.
టెక్నికల్ పరంగా చూస్తే థేని ఈశ్వర్ తన కెమెరాతో మ్యాజిక్ చేశారని చెప్పాలి. కొన్ని సనివేశాలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు అరుణ్ దర్శకత్వ శైలిని చూస్తుంటే.. కొత్తతరం ఆలోచనలకు అద్దం పడుతుంది.
బలాలు
* విక్రమ్ నటన
* యాక్షన్ సీన్స్, ఛాయాగ్రహణం
* సెకండాఫ్‌లో డ్రామా
బలహీనతలు
* ఆసక్తి రేకెత్తించని కథనం