బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకేక్కిస్తున్న తాజా చిత్రం RRR ( వర్కింగ్ టైటిల్ మాత్రమే).. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.. వచ్చే ఏడాది జులై 30 న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ,కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే..
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం తమ నటుడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో ఇప్పటికే తెలుసు కాబట్టి ఆ పాత్రకు సంబంధించిన లుక్ లతో పోస్టర్ లను రెడీ చేసి బయటకు వదులుతున్నారు. కొన్ని సార్లు ఇవే ఆఫిషల్ అనేలా ఉంటున్నాయి. అంతలా ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా మారాయి. మీరు కూడా వీటిపైన ఓ లుక్ వేయండి.