Rajamouli: హమ్మయ్యా.! రాజమౌళి మొదలెట్టేశాడు.. మహేష్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

Rajamouli Mahesh Movie: రాజమౌళి, మహేష్‌బాబు సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-30 09:59 GMT

Rajamouli: హమ్మయ్యా.! రాజమౌళి మొదలెట్టేశాడు.. మహేష్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

Rajamouli Mahesh Movie: రాజమౌళి, మహేష్‌బాబు సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ట్రిపులార్‌ సినిమాలతో నేషనల్‌ వైడ్‌గా సంచలనం సృష్టించిన రాజమౌళి.. ఈసారి వరల్డ్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేశారు. ఇందులో భాగంగానే మహేష్‌ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కథాకథనం మొదలు మేకింగ్ వరకు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ఇతర దేశాల్లోనూ అక్కడి లాంగ్వేజేస్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారనే వార్తలు చిత్రంపై అంచనాలను ఆకాశన్నంటేలా చేశాయి. ఇంతవరకు టైటిల్‌ను కూడా ప్రకటించని ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే చిత్ర యూనిట్‌ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

కానీ తాజాగా దర్శకుడు రాజమౌళి ఎట్టకేలకు మహేష్ సినిమాపై ఒక చిన్న అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా షూటింగ్‌ కోసం లొకేషన్స్‌ను వెతికే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. కెన్యాలోని అంబోసెలి అనే నేషనల్ పార్క్‌లో నడుస్తున్న ఫొటోను షేర్‌ చేసిన రాజమౌళి.. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. దీంతో ఎట్టకేలకు మహేష్‌ సినిమా మొదలవ్వడానికి సమయం ఆసన్నమైందని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇక ఈ సినిమా కోసం మహేష్‌ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. గడ్డం, జుట్టును పెంచేశారు. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, ఇందుకోసం ఆయన శిక్షణ కూడా తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ అడ్వెంచర్‌ యాక్షన్‌ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే జనవరి నుంచి ప్రారంభంకానుంది.


Tags:    

Similar News