Sankranthi Movies Ticket Price: సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలు.. టికెట్ రేట్లు ఏ చిత్రానికి ఎంతంటే..!

Sankranthi Movies Ticket Price Hike : సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు రాబోతున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం'

Update: 2025-01-01 12:12 GMT

Sankranthi Movies Ticket Price: సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలు.. టికెట్ రేట్లు ఏ చిత్రానికి ఎంతంటే..!

Sankranthi Movies Ticket Price Hike : సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు రాబోతున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. అయితే ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి ఇవి విజేతలుగా నిలిచే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.

నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా దూకుడు చూపిస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. తన నటతో వరుస బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ.. తాజాగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా చేస్తున్నారు. జనవరి 12వ తేదీని సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

హీరో రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్ గా.. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్.జె సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రంకావడం.. ద్విపాత్రాభినయంతో విభిన్న గెటప్పుల్లో కనిపించనుండడం ఇలా పలు అంశాల్లో గేమ్ ఛేంజర్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిచిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకటేష్, అనిల్ కాంబినేషన్లో వస్తుండడంతో ఈ యాక్షన్ కామెడీ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.

సంక్రాంతికి వస్తున్న ఈ మూడు సినిమాలు నువ్వా-నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. సినిమాల ఫలితాలు పక్కన పెడితే భారీ వసూళ్లు రాబట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మొదటి రెండు మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు వచ్చే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు వచ్చిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తున్నాయి. అయితే ఇటీవల వచ్చిన పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సినిమాలకు ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని అసెంబ్లీలో ప్రకటించారు. సినీ ప్రముఖులు అంతా వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసినా తాను అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

దీంతో నైజాం ఏరియాలో సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై ఆశలేదు. కానీ ఏపీలో మాత్రం సంక్రాంతి సినిమాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమాల బడ్జెట్ ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని మూడు సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమాకి మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.135, మల్టీప్లెక్స్‌లో రూ.175ల టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. లిమిటెడ్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను రూ.600 గా నిర్ణయించింది.

బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ మూవీకి ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ. 110, మల్టీప్లెక్స్ ల్లో రూ.135 లు పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకు ఉన్నాయి. వీటికి మాత్రం రూ.500 పెంచుకునేలా అవకాశం ఇచ్చింది.

వెంకటేష్‌ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అవకాశం లేకపోవడంతో ఇక్కడ నిర్మాతలకు, ముఖ్యంగా ఇక్కడ థియేట్రికల్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News