Keerthy Suresh: బేబీజాన్ ప్రమోషన్‌లో పసుపు తాడుతో అందుకే కనిపించా? ఇంట్రెస్టింగ్ విషయం తెలిపిన కీర్తి సురేష్..
Keerthy Suresh: నటి కీర్తి సురేష్ ఇటీవలే తన స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగింది.
Keerthy Suresh: నటి కీర్తి సురేష్ ఇటీవలే తన స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్.. తన పెళ్లికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆంటోని కుటుంబ ఆచారాలకు అనుగుణంగాక్రిస్టియన్ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్నామని చెప్పారు.
క్రిస్టియన్ సాంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక తన తండ్రితో జరిగిన సంభాషణను ఆయన ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సాంప్రదాయం ప్రకారం వధువును ఆమె తండ్రి పెళ్లి వేదిక పైకి తీసుకురావాలి. తన కోసం మీరు కూడా ఆ విధంగా చేస్తారా ..? అని అడిగితే అందుకు ఆయన అంగీకరించారని ఆమె తెలిపారు. రెండు సాంప్రదాయాల్లో వివాహం జరుపుతున్నందునతాను కూడా ఆ పద్దతులు పాటిస్తానని ఆయన బదులిచ్చారు. ఆ మాట తనకుకెంతో సంతోషాన్ని ఇచ్చిందని కీర్తి సురేశ్ చెప్పారు.
ఇటీవల బేబీజాన్ ప్రమోషన్ ఈవెంట్స్‌కు పసుపుతాడుతో హాజరుకావడంపై స్పందించారు. దక్షిణాదిలో ఒక సాంప్రదాయం ఉంది. పెళ్లి సమయంలో వధువు మెడలో వరుడు పసుపుతాడు కడతాడు. దానిని పవిత్రంగా భావిస్తారు. పెళ్లైన కొన్ని రోజులకు ఒక మంచి ముహూర్తం చూసి మంగళ సూత్రాలను బంగారు చైన్‌లోకి మార్చుకుంటారని ఆమె వివరించారు. జనవరి చివరివరకూ మంచి రోజులు లేవు. అప్పటివరకు తాను ఎక్కడికి వెళ్లినా పసుపుతాడుతోనే కనిపిస్తాను అని ఆమె వివరించారు.
ఇక ఆంటోని తనకు 15ఏళ్ల నుంచి తెలుసునని.. తనకంటే ఏడేళ్లు పెద్ద వాడని తెలిపారు. రిలేషన్‌లో ఉన్నప్పుడు తాము కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. 2022లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.