Allu Arjun: అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

అల్లు అర్జున్ (Allu Arjun) కు నాంపల్లి కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

Update: 2025-01-03 11:51 GMT

అల్లు అర్జున్ (Allu Arjun) కు నాంపల్లి కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 2023 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ పిటిషన్ పై కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. ఈ కేసులో డిసెంబర్ 13న అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.

దీంతో నాంపల్లి కోర్టులో గత ఏడాది డిసెంబర్ లో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్నతెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించింది. రూ. 50 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు సూచించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని కూడా ఆదేశించింది. విచారణకు పోలీసులకు సహకరించాలని కూడా  కోర్టు ఆదేశించింది.

పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11 గా ఉన్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ ఇతర సిబ్బందితో పాటు అల్లు అర్జున్ ఆయన సిబ్బంది, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతినిధులపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో మైత్రీ మూవీ సంస్థ ప్రతినిధులకు జనవరి 2న బెయిల్ మంజూరైంది.

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రధాన కారణమని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనుమతి లేకున్నా అల్లు అర్జున్ పై రోడ్ షో నిర్వహించారని ఆయన చెప్పారు.తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయాన్ని పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ పట్టించుకోలేదన్నారు. సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ పరోక్షంగా కామెంట్ చేశారు. తొక్కిసలాట జరిగిందని రేవతి మరణించిన విషయం ఒక్క రోజు తర్వాతే తనకు తెలిసిందని ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. 

Tags:    

Similar News