Game Changer Trailer: శంకర్ మార్క్ డైరెక్షన్.. అంచనాలు పెంచేసిన గేమ్ ఛేంజర్ ట్రైలర్..!
Game Changer Trailer: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం గేమ్ ఛేంజర్.
Game Changer Trailer: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ట్రిపులార్ వంటి భారీ విజయం తర్వాత చెర్రీ నటిస్తున్న చిత్రం కావడం, భారతీయుడు వంటి డిజాస్టర్ తర్వాత కసితో ఉన్న శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని జనవరి 10వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2.40 నిమిషాల నిడివి ఉన్న సినిమా ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు, లక్ష చీమలు బతుకుతాయని చెర్రీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా శంకర్ మార్కలో ఉండనుందని చెప్పేందుకు ఈ ఒక్క డైలాగ్ సరిపోతుందని అర్థమవుతోంది. ఇక అంజలి, ఎస్ జే సూర్య యాక్టింగ్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. తమన్ అందించిన మ్యూజిక్ బాగుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
సినిమా ట్రైలర్‌ను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. చెర్రీని కొత్తగా చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత మరోసారి శంకర్ తన మార్కును చూపించడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి భారీ అంచనాల నడుమ వస్తున్న గేమ్ ఛేంజర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.