Ram Charan: చెర్రీ ధరించిన ఈ హుడీ ధర ఎంతో తెలుసా.? ఏకంగా..

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో రామ్‌ చరణ్‌ ఒకరు. తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకున్నాడు.

Update: 2025-01-02 06:35 GMT

Ram Charan: చెర్రీ ధరించిన ఈ హుడీ ధర ఎంతో తెలుసా.? ఏకంగా..

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో రామ్‌ చరణ్‌ ఒకరు. తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకున్నాడు. తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. కాగా ట్రిపులార్‌ వంటి భారీ హిట్‌ తర్వాత చెర్రీ వెండి తెరకు కనిపించలేదు. ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. గురువారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. కాగా తాజాగా బాలయ్య హోస్ట్‌గా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అన్‌స్టాపబుల్‌ షోకు రామ్‌ చరణ్‌ అతిథిగా హాజరయ్యాడు.

ఈ షోకి ఫ్రెండ్ శర్వానంద్, నిర్మాత విక్రమ్ రెడ్డితో కలిసి సందడి చేశారు. ఈ షో ప్రస్తుతం ఆహాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ తన లేటెస్ట్ లుక్‌తో సందడి చేశారు. ముఖయంగా బ్లాక్‌ కలర్‌ హుడీ హైలెట్‌గా నిలిచింది. రామ్‌ చరణ్‌ ధరించిన ఈ హుడీ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో దీని ధర ఎంత అని నెట్టింట వెతకడం ప్రారంభించారు. అమిరి బ్రాండ్‌కు చెందిన ఈ హుడీ ధర అక్షరాల రూ. లక్ష పదివేలు కావడం విశేషం. ఈ విషయం తెలిసిన చెర్రీ ఫ్యాన్స్‌ ఇది మా హీరో రేంజ్‌ అంటూ తెగ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్‌ అంటే ఈ మాత్రం ఉంటుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News