SSMB 29 Launch: మహేష్-రాజమౌళి మూవీ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?
SSMB 29 Launch: సూపర్ స్టార్ మహేశ్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ SSMB29.
SSMB 29 Launch: సూపర్ స్టార్ మహేశ్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ SSMB29. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రూపొందనుంది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులర్ అయ్యారు. దీంతో మహేష్ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అనే నిరీక్షణ మాత్రం చాలాకాలంగా కొనసాగుతోంది.
మహేష్-రాజమౌళి SSMB29 ప్రాజెక్ట్ జనవరి 2న లాంచ్ కానుంది. గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని ప్రచారం సాగుతోంది.
ఈ చిత్రం కోసం మహేష్ లుక్ మార్చేశారు. లాంగ్ హెయిర్, గడ్డం, కండలతో కనిపిస్తున్నారు. మహేశ్‌ను ఈ లుక్‌లో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణాలు అన్ని పూర్తయినట్టు సమాచారం. కథతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని భాషలకు సంబంధించిన వెర్షన్స్ పూర్తయినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు టాక్. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ చేయని డిఫరెంట్ రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు రాజమౌళి.
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ మూవీ జనవరిలో మొదలవుతుందని ఇటీవల ఆయన చెప్పారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గ్లోబల్ రేంజ్ మూవీ కావడంతో ఈ సినిమాలో నటీనటులు ఎవరు ఉంటారనే ఆసక్తి కలిగిస్తోంది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. హాలీవుడ్‌లో ప్రియాంక పాపులర్. దీంతో ఆమెతో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అయితే జనవరి 2న మూవీ ప్రారంభం మాత్రమే ఉంటుందా..? రాజమౌళి ప్రెస్ మీట్ కూడా ఏమైనా ఉంటుందా అని ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రతీ సినిమా ప్రారంభం ముందు రాజమౌళి మీడియాకు వివరాలు వెల్లడిస్తారు. ఒకవేళ ప్రెస్ మీట్ ఉంటే నటీనటుల గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రాజమౌళి దాన్ని ఫాలో అవుతారా..? లేదా సస్పెన్స్ కొనసాగిస్తారా అన్నది చూడాలి మరి.