Bangalore Rave Party: నటి హేమకు హైకోర్టులో ఊరట
బెంగుళూరు రేవ్ పార్టీ (Bangalore Rave party)కేసులో నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో (Banglore High Court)ఊరట లభించింది.
బెంగుళూరు రేవ్ పార్టీ (Bangalore Rave party)కేసులో నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో (Banglore High Court)ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసులో తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది.
అసలు ఏం జరిగింది?
బెంగుళూరు శివారులోని ఫామ్ హౌస్ లో 2024 మే 19 రాత్రి సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ నిర్వహించారు. ఈ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న 103 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని రిపోర్టుల్లో తేలింది.డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిన వారి జాబితాలో నటి హేమ పేరు కూడా ఉందని అప్పట్లో బెంగుళూరు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ పార్టీలో కన్నడ సీరియల్స్ నటీనటులు 20 మంది, మోడల్స్ కూడా పాల్గొన్నారని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.
హేమ అరెస్ట్ విడుదల
టాలీవుడ్ నటి హేమను బెంగుళూరు పోలీసులు 2024 జూన్ 4న అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆమెను విచారించిన తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను బెంగుళూరు కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆమెను రిమాండ్ కు తరలించింది. రెండుసార్లు బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెకు బెయిల్ రావడంతో గత ఏడాది జులై 14 న ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మరో వైపు తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. తాను నిర్వహించుకున్న టెస్టుల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు రిపోర్టులో తేలిందని తెలిపారు. డ్రగ్స్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని ఆమె ఓ వీడియోను 2024, ఆగస్టు 20న మీడియాకు విడుదల చేశారు. తాను ఎలాంటి ఎలాంటి పరీక్షలకైనా సిద్దమన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో తనపై బురద చల్లారని ఆమె మీడియాపై ఆ వీడియోలో ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్ మెంట్ ను కూడా ఆమె కోరారు.