OTT Releases This Week: కొత్తేడాదికి కొత్త కంటెంట్‌తో వెల్‌కమ్.. ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు
కొత్తేడాదిలోకి అడుగు పెట్టారు. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంది.
OTT Releases This Week (December 30, 2024 To January 5, 2025): కొత్తేడాదిలోకి అడుగు పెట్టారు. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంది. 2025 కొత్త సంవత్సర వేడుకల జోష్‌ను మరింత పెంచుతూ ఓటీటీ వేదికగా సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటున్నాయి. మరి 2025 తొలి వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోన్న ఓటీటీ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో కథా కమామీషు అనే సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇందర్రజ కరుణకుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి బజ్ ఉంది.
* అమెరికా మాజీ అధ్యక్షుబు ఒబామా మెచ్చిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమా డిస్ట్నీ+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. జనవరి 3వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
* ఇక ఈ వారం ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 3వ తేదీ నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
* ఈ వారం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఐ యామ్ కథలన్. నస్లేన్, అనిష్మా జంటగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికే మనోరమా మ్యాక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
* గ్లాడియేటర్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. పాల్ మెస్లక్, పెడ్రో పాస్కల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది.
* ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లో మిస్సింగ్ యూ ఒకటి. రిచర్డ్, జెస్సికా జంటగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
* నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెల్లింగ్ ది సిటీ అనే వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తోంది. టేలర్ మిడెల్టెన్, జోర్డిన్ టేలర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ జనవరి 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
* ప్రభుదేవా, మడోన్న సెబాస్టియన్ జంటగా తెరకెక్కిన జాలీ ఓ జింఖానా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వేదికగా ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.
* ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్‌కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ షోకి బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్ర యూనిట్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఈ ఇంటర్వ్య జనవరి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ది రానా దగ్గుబాటి షోలో భాగంగా ఉపేంద్ర, ఫరియా, నవదీప్ హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ జనవరి 4వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
* వీటితో పాఉట నెట్‌ఫ్లిక్స్ వేదికగా డోంట్‌డై, రీ యూనియన్, లవ్ ఈజ్ బ్లైండ్ వంటి ప్రాజెక్ట్స్ స్ట్రీమింగ్ అవుతుండగా, వెన్ ది స్టార్స్ గాసిప్ జనవరి 4వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వేదికగా ది రిగ్ అనే సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది.