Bhagyashree: షూటింగ్లో అలా చేసే సరికి సల్మాన్‌ఖాన్‌ను అపార్థం చేసుకున్నా..
Bhagyashree: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Bhagyashree: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వీరిద్దరు హీరో, హీరోయిన్గా నటించిన మైనే ప్యార్ కియా సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో భాగ్యశ్రీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందచందాలతో యువత హృదయాలను కొల్లగొట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ షూటింగ్ సమయంలో ఓ సారి సల్మాన్‌ను అపార్థం చేసుకున్నట్టు తెలిపారు భాగ్యశ్రీ.
మైనే ప్యార్ కియా సినిమా వల్ల సల్మాన్‌తో తనకు మంచి స్నేహం ఏర్పడిందని భాగ్యశ్రీ తెలిపారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక రోజు సల్మాన్ తన పక్కన కూర్చొని తన చెవిలో ఓ లవ్ సాంగ్ పాడారని.. ఆ రోజంతా తన వెంట పడ్డారని చెప్పారు. ఆయన ప్రవర్తన తనకు ఏ మాత్రం అర్థం కాలేదన్నారు. సల్మాన్ తనను ఆటపట్టిస్తున్నారేమోనని మొదట భావించానని.. అయితే కొద్దిసేపటికే అది హద్దులు దాటిందని తెలిపారు. ఎందుకు ఇలా చేస్తున్నారని సల్మాన్ పై తాను కోపడ్డానని చెప్పారు.
అయితే వెంటనే సల్మాన్ తనను పక్కకు తీసుకెళ్లి నువ్వు ఎవరి ప్రేమలో ఉన్నావో నాకు తెలుసు. నీ ప్రియుడు హిమాలయ గురించి తెలుసు. ఆయనను ఒకసారి సెట్‌కు పిలవచ్చు కదా అని అన్నారని చెప్పారు. అది విని తన లవ్ స్టోరీ సల్మాన్ కు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయానని చెప్పారు. తనను ఆట పట్టించేందుకే సల్మాన్ అలా చేశారని.. తనను తాను తప్పుగా అర్థం చేసుకున్నానని తెలిపారు.
సూరజ్ బర్జాత్యా తెరకెక్కించిన ఈ చిత్రంతో భాగ్యశ్రీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా విడుదలైన కొంతకాలానికే ఆమె హిమాలయ దాసానీని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన భాగ్యశ్రీ.. పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ కెరీర్ నుంచి విరామం తీసుకున్నారు. ఇటీవల రాధేశ్యామ్, తలైవి, కిసీ కా భాయ్ కిసీకా జాన్ వంటి చిత్రాల్లో నటించారు.