Abhimani: సురేష్ కొండేటి హీరోగా సినిమా.. ఆకట్టుకుంటోన్న'అభిమాని' గ్లింప్స్‌..

Abhimani: సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు.

Update: 2024-10-07 03:30 GMT

Abhimani: సురేష్ కొండేటి హీరోగా సినిమా.. ఆకట్టుకుంటోన్న'అభిమాని' గ్లింప్స్‌..

Abhimani: సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి లీడ్ రోల్ లో ఓ మూవీ చేస్తున్నారు. సురేష్ కొండేటి హీరోగా అభిమాని అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‍లైన్ తోనే సినిమా తెరకెక్కింది.

భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‍కే రహ్మాన్, మరియు కంద సాంబశివరావు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సురేష్ కొండేటి పుట్టిన రోజు (అక్టోబర్ 6) సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా గ్లింప్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''అభిమాని' మూవీ గ్లింప్స్ చాలా బాగుంది. 'అభిమాని' అనే టైటిల్ చాలా ఆరోగ్యకరంగా, చాలా బాగుంది. అక్కడే సినిమా సగం విజయం సాధించింది. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఒక స్ఫూర్తిదాయకంగా ఈ మూవీ తీశారని అనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు.

సురేష్‌ కొండేటి మాట్లాడుతూ.. 'దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది. పంపిణీ దారుడిగా నా కెరీర్ మొదలైందే రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1'తో. ఆ సినిమాతోనే రాజమౌళిగారు దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఆ సినిమా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో నేను పంపిణీ చేశాను. ఘన విజయాన్ని సాధించిన ఆ సినిమా నాకు పంపిణీదారుడిగా బలమైన పునాదిని వేసింది. ఆ క్రమంలోనే ఆ తర్వాత పలు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. నిర్మాతగానూ మారాను' అని పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. 

Full View


Tags:    

Similar News