Rachitha Mahalakshmi: అసభ్య సందేశాలు పంపుతున్నాడు.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
Rachitha Mahalakshmi: అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలతో వేధిస్తున్నారని ఆవేదన
Rachitha Mahalakshmi: తమిళ నటి రచిత తాను లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న తెలిపారు. వీడియోలతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభేదాల కారణంగా గత కొంత కాలంగా రుచిత భర్తకు దూరంగా ఉంటున్నారు. అసభ్యకర మేసేజులు పంపిస్తూ వేధిస్తున్నట్లు రచిత తెలిపారు. వేధింపులపై రచిత మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరుకు చెందిన రచిత 2011లో విజయ్ టీవీలో ప్రసారమైన పిరివోం సందిపోమ్ సీరియల్‌లో నటించారు. ఆ క్రమంలో ఆమె పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తన కోస్టార్ దినేష్ గోపాలస్వామితో ప్రేమలో పడ్డారు. ఈ జంటకు 2013లో వివాహమైంది. అయితే మనస్పర్ధల కారణంగా రచిత, దినేష్ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి రచిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త దినేష్ తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని, బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.