Prakash Raj: మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

Prakash Raj: కొండా సురేఖ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌

Update: 2024-10-02 13:15 GMT

Prakash Raj: మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

Prakash Raj: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ ఏంటీ సిగ్గుమాలిన రాజకీయాలు అంటూ ప్రశ్నించారు. కేటీఆర్‌పై విమర్శలు చేసిన కొండా సురేఖ.. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణమయ్యారని కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన ప్రకాశ్ రాజ్.... సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా అంటూ ఎక్స్ వేదికగా కొండా సురేఖను ప్రశ్నించారు.

కొండా సురేఖ ఏమన్నారంటే?

నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో పలువురు హీరోయిన్లు కొందరు త్వరగా పెళ్లిళ్లు చేసుకొని సినిమా ఫీల్డ్ వదిలివెళ్ళడానికి కూడా ఆయనే కారణమని మంత్రి ఆరోపించారు. మత్తు పదార్ధాలకు కేటీఆర్ అలవాటుపడ్డారని... సినీ పరిశ్రమలోని వాళ్లకు కూడా మత్తు పదార్ధాలకు అలవాటు చేశారని ఆమె చెప్పారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖకు నూలుదండ వేశారు. ఈ దండపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్ వెనుక కేటీఆర్ ఉన్నారని కొండా సురేఖ ఆరోపించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ విమర్శలపై కొండా సురేఖ స్పందించారు.


Tags:    

Similar News