Adipurush Trailer Review: ఓం కమ్ టు మై రూం.. ఈసారి పార్టీ.. బ్రహ్మాండంగా ఆదిపురుష్ ట్రైలర్..
Adipurush Trailer Review: ఓం కమ్ టు మై రూం.. ఈసారి పార్టీ.. బ్రహ్మాండంగా ఆదిపురుష్ ట్రైలర్..
Adipurush Trailer Review: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది. రామాయణం ఇతిహాసం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కి సిద్ధం అవుతుండగా తాజాగా నిర్మాతలు ఆదిపురుష్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొత్తం 3 నిమిషాల 20 సెకండ్లతో ఉన్న ట్రైలర్ చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. సీతను అపహరించడంతో మొదలు పెట్టి రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం ఇలా రాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఒక్కొక్కటి పరిచయం చేస్తూ చివరకు రామ, రావణ యుద్ధం షాట్ తో ట్రైలర్ ముగిసింది.
ట్రైలర్ లోని విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా రావణ పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ లుక్స్, రామ సైన్యం పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను పెట్టి దర్శకుడు ఓం రౌత్ చిన్న పిల్లల సినిమా తీశాడంటూ..గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలన్నింటికీ తాజాగా విడుదలైన ట్రైలర్ చెక్ పెట్టేసింది. దర్శకుడు ట్రైలర్ ను బ్రహ్మాండంగా కట్ చేశారు.
ట్రైలర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్...తమ అభిమాన హీరోకి హిట్ గ్యారెంటీ అంటున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్.. రెండు సినిమాలు బాక్సాఫీసుల్ని మెప్పించలేదు. దీంతో డార్లింగ్ అభిమానులంతా ఆదిపురుష్ పైనే హోప్ పెట్టుకున్నారు. కానీ, టీజర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం కలవరపడ్డారు. టీజర్ కు నెగిటివ్ కామెంట్స్ రావడంతో జాగ్రత్త పడ్డ మేకర్స్ వీఎఫ్ ఎక్స్ కోసం అదనంగా 100 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఖర్చు ఫలితం ఆదిపురుష్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. ట్రైలర్ చూస్తుంటే ఒక విజువల్ వండర్ చూడబోతున్నట్లు ఫీలింగ్ కలిగింది.
మొత్తంగా, రామాయణంను త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్ సినిమాను జూన్ 16న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్త నగే , రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇకపోతే, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఓం రౌత్ ను ప్రభాస్ ఈసారి రూంకి పిలిచి పార్టీ ఇవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.