Hari Hara Veera Mallu: క్రిష్ ప్లాన్స్ మార్చేసిన పవన్ కళ్యాణ్...
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "హరిహర వీరమల్లు".
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "హరిహర వీరమల్లు". నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనులతో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేయమని 40 రోజుల డేటులను అలాట్ చేశారట. కానీ క్రిష్ మాత్రం 40 రోజులు సినిమాకి సరిపోవని కనీసం 65 రోజులైనా ఇచ్చేలాగా చూడమని పవన్ కళ్యాణ్ ను కోరారట. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ క్రిష్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితులలో 65 రోజులు సినిమా కోసం కేటాయించటం కష్టమని చెప్పిన పవన్ కళ్యాణ్ కేవలం 40 రోజుల్లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేయమని చెప్పారట.
దీంతో చేసేది లేక ఉన్న 40 రోజులలో పవన్ కళ్యాణ్ క్లోజ్ అప్ సన్నివేశాలను షూటింగ్ పూర్తి చేసి మిగతా సన్నివేశాలను డూప్ తో చేయించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతోంది.