SS Thaman: తమన్ ను సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్..

SS Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ తమన్ కూడా ఒకరు.

Update: 2022-12-08 07:19 GMT

SS Thaman: తమన్ ను సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్..

SS Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ తమన్ కూడా ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల అన్నిటికీ దాదాపు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన తమన్ ఎన్నో చార్ట్ బస్టర్ పాటలను అందించినప్పటికీ ఏదో ఒక విధంగా ఎప్పటికప్పుడు ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటారు. తాజాగా మళ్లీ తమన్ సంగీతం పై నెగటివ్ కామెంట్లు మొదలయ్యాయి.

కాపీ క్యాట్ అంటూ అంటూ మళ్లీ తమన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకి తమన్ అందించే సంగీతం బాగోవటం లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట్లో ఫ్యాన్స్ తమన్ కి సపోర్ట్ చేస్తూ తన వైపు వకాల్తా పుచ్చుకున్నారు. తమన్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" సినిమాలకి తమన్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలకి తమన్ అందించిన సంగీతం ఆ సినిమాలకే ప్లస్ పాయింట్ గా మారిందని ఆ రెండు సినిమాలలోనూ తమన్ అందించిన సంగీతం సినిమాలని బాగా ఎలివేట్ చేసిందని ఇంతకుమించి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇంకేం కావాలి అంటూ తమన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక గత రెండేళ్లలో తమన్ చాలావరకు పెద్ద సినిమాలకి సంగీతాన్ని అందించారని కానీ వాటన్నిటిలోనూ మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాకి తప్పించి మిగతా సినిమాల బీ జి ఎం చాలా బాగా క్లిక్ అయింది ఈ సమయంలో తమన్ పై ఇంత ద్వేషం పనికిరాదు అంటూ తమన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News