The GOAT: 'ది గోట్‌' ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ప్రశాంత్‌, స్నేహ, వైభవ్‌, లైలా, ప్రభుదేవా వంటి అగ్ర తారలు ప్రధాన పాత్రల్లో నటించారు.

Update: 2024-10-01 15:18 GMT

The GOAT: 'ది గోట్‌' ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

విజయ్‌ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం ది గోట్. వెంటక్‌ ప్రభు దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 5వ తేదీన థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్నా.. వసూళ్ల పరంగా మాత్రం సక్సెస్‌ అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను సాధించింది.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ప్రశాంత్‌, స్నేహ, వైభవ్‌, లైలా, ప్రభుదేవా వంటి అగ్ర తారలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక కెరీర్‌లోనే తొలిసారి త్రిష ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించడం విశేషం. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అక్టోబర్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందని తెలిపారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా అందుబాటులో రానుందని తెలుపుతూ నెట్‌ ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్‌ అయిన ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.

ఇంతకీ సినిమా కథేంటంటే..

గాంధీ (విజయ్‌) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీంలో ఏజెంట్ లా వర్క్ చేస్తుంటాడు. తన ఉద్యోగం గురించి తన భార్య అను (స్నేహ)కు కూడా చెప్పడు. అయితే ఇదే సమయంలో ఓ మిషన్ కోసం థాయ్ ల్యాండ్ వెళ్లిన గాంధీ.. అక్కడ తన ఐదేళ్ల కొడుకు జీవన్ ను కోల్పోతాడు. దీంతో తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. ఆ బాధతోనే భార్య కూడా దూరం పెడుతుంది. 15 ఏళ్ల తర్వాత ఓ పని కోసం మాస్కోకు వెళ్లిన గాంధీకి తన కొడుకు జీవన్ కనిపిస్తాడు. ఓ రౌడీ బృందంలో చిక్కుకుని ఉన్న తన బిడ్డను కాపాడి భారత్ తీసుకువస్తాడు. దీంతో కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా గడుపుతుంటారు. అయితే ఇదే సమయంలో గాంధీ టీం బాస్‌ నజీర్‌ (జయరాం)ను ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత టీంలో ఒక్కొక్కరు హత్యకు గురవుతుంటారు. దీంతో అసలు ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి.? ఆ హత్యలకు జీన్‌కు సంబంధం ఏంటి.? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags:    

Similar News