Naga Shaurya: నాగశౌర్య నిజ జీవితంలో కూడా హీరోనే అంటున్న ఫ్యాన్స్..

Naga Shaurya: నాగశౌర్య నిజ జీవితంలో కూడా హీరోనే అంటున్న ఫ్యాన్స్..

Update: 2023-03-02 06:15 GMT

Naga Shaurya: నాగశౌర్య నిజ జీవితంలో కూడా హీరోనే అంటున్న ఫ్యాన్స్..

Naga Shaurya: కొన్ని కొన్ని సార్లు హీరోలు తాము చేసే సినిమాల కంటే నిజజీవితంలో వారు చేసే పనుల వల్ల ఎక్కువమంది అభిమానులను దక్కించుకుంటూ ఉంటారు. సూపర్ హిట్ సినిమాలు కాకపోయినా మంచి మనసున్న కూడా హీరోలు నిజజీవితంలో కూడా హీరోలు అవుతారు. తాజాగా అలాంటి ఒక మంచి పని చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యువ హీరో నాగ శౌర్య. రోడ్డుమీద ఒక అమ్మాయిని చేయి చేసుకుంటున్నా యువకుడిని ఆపి నిలదీసి నాగశౌర్య అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ ఘటన మంగళవారం నాడు హైదరాబాదులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగశౌర్య మంగళవారం నాడు తన కారులో బయటికి వెళ్లాడు. అయితే రోడ్డు మీద ఒక యువకుడు ఒక అమ్మాయిని కొట్టడం గమనించాడు శౌర్య. దీంతో వెంటనే కారు దిగి వెళ్లి ఆ యువకుడ్ని నిలదీశాడు. ఆ యువకుడిని అడ్డుకొని రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు.

మేమిద్దరం లవర్స్ అని అబ్బాయి చెప్పినా కూడా నాగశౌర్య ఊరుకోలేదు. లవర్ అయితే కొడతావా అంటూ ఆ యువకుడి మీద అరవడంతో ఆ యువకుడు వెంటనే ఆ అమ్మాయికి సారీ చెప్పేసాడు. నిజానికి ఇదంతా ఒక ప్రాంక్ వీడియో అని అందరూ అనుకున్నారు. కానీ అది రీల్ కాదు రియల్ అని తర్వాత అర్థమైంది. దీంతో నాగశౌర్య చేసిన మంచి పని కారణంగా అందరూ నాగశౌర్య ను బాగా అభినందిస్తున్నారు. ఇలా నాగశౌర్య తన పెద్ద మనసుతో కొంతమంది మనసులను గెలుచుకుని నిజ జీవితంలో కూడా హీరో అయ్యాడు.

Tags:    

Similar News