Chiranjeevi Oxygen Bank: ఇంట్లోనే ఆక్సిజన్ బ్యాంక్ పెట్టిన చిరంజీవి అభిమాని

Chiranjeevi Oxygen Bank: న‌ల్లా శ్రీధర్ అనే అభిమానికి మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఫోన్ చేసి అభినందించారు.

Update: 2021-06-18 07:58 GMT

చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi Oxygen Bank: కరోనా సెకండ్ వేవ్ లో మెగాస్టార్ చిరంజీవి చాలా ఫోకస్ గా ఛారిటీ సేవలు అందిస్తున్నారు. ఆక్సిజన్ అందించడంతో పాటు.. అంబులెన్సులు కూడా ప్రారంభిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేశారు చిరంజీవి. దీనికి తన సొంత నెట్ వర్క్ ను వాడారు. మెగా ఫ్యాన్స్ ఈ ప్రాసెస్ లో భారీగా పాల్గొన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం ఏర్పాట్లు చూశారు. అయితే తూర్పుగోదావరి అమలాపురంలో ఉన్న ఓ అభిమానం తన ఇంట్లోనే ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి.. మెగాస్టార్ అభినందనలు పొందారు.

ఆక్సిజన్ బ్యాంకును సొంత ఇంటిలో నిర్వహించడం గొప్ప నిర్ణ‌య‌మ‌న్నారు. అభిమానులు ఇలా సేవ చేయ‌డం త‌న మ‌న‌సుకు ఎంతో ఆనందక‌రమన్నారు. మున్ముందు ఇంకా మంచి ప‌నులు చేయాలంటూ శ్రీధ‌ర్‌కు సూచించారు మెగాస్టార్. కరోనా ఉధృతి తగ్గిన తరువాత హైదరాబాద్ వ‌చ్చి క‌ల‌వాల‌ని శ్రీధ‌ర్‌ను చిరు కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేశారు మెగాస్టార్. జిల్లాల్లో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపిస్తున్నారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ జరుగుతుంది. ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికడుతూ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ చ‌నిపోకూడ‌ద‌న్న‌ ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Full View


Tags:    

Similar News