Major: 'మేజర్'.. అసలు సిసలైన భారతీయ సినిమా - అడివి శేష్
Major: టాలీవుడ్ నటుడు అడివి శేష్ విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
Major: టాలీవుడ్ నటుడు అడివి శేష్ విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం 26/11 అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత స్ఫూర్తితో నిర్మిస్తున్న "మేజర్" అనే ద్విభాషా చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అడివి శేష్ కి తొలి హిందీ చిత్రం అవుతుంది.
మేజర్ నిజమైన పాన్ ఇండియా మూవీ అని అడివి శేష్ అంటున్నాడు. మేజర్ సినిమాపై మీడియాతో మాట్లాడుతూ..తన అనుభవాలను పంచుకున్నాడు. "మేము ఎల్లప్పుడూ మంచి కథను చెప్పాలని ఆశిస్తున్నాము. మేజర్ సందీప్ స్టోరీ ప్రతీ ఒక్కరికి తెలియాలి. అతనో కార్గిల్ యుద్ధ వీరుడు. కేరళకు చెందిన అతను..హైదరాబాద్ లో పనిచేశాడు. బెంగళూరులో పెరిగాడు. కాబట్టి మేజర్ సినిమా కచ్చితంగా ప్యూర్ పాన్ ఇండియన్ మూవీ అంవుతుంద"ని అడివి శేష్ అన్నాడు.
ఈ సినిమా కోసం అడివి శేష్ మేజర్ సందీప్ జీవితంపై చాలా పరిశోధనలు చేశాడు. అతనిలా చేసేందుకు చాలా కష్టపడ్డాడు. "సందీప్ తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. ఏదైనా సన్నివేశంలో సందేహం వస్తే.. వారితో మాట్లాడి పరిష్కరించుకుంటాను. అలాగే సైన్యంలో పనిచేసిన అతడి స్నేహితులతో కూడా మాట్లాడాను అని" అడివి శేష్ అన్నాడు.
"ఈ పాత్ర చేస్తున్నప్పుడు నేను ఎన్నో భావోద్వేగాలను అనుభవించాను. సందీప్ అందరినీ ప్రేమించే వ్యక్తి. అతను ఎప్పుడూ జోకులు వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. అందుచేత ఆయన చుట్టూ చాలా మంది చేరేవారని" శేష్ వెల్లడించాడు.
ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు సాషి కిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు.