Mahesh Babu - Acharya: ఆచార్య కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు...

Mahesh Babu - Acharya: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే...

Update: 2022-04-21 12:00 GMT
Mahesh Babu Voice Over for Megastar Chiranjeevi in Acharya Movie | Tollywood News

Mahesh Babu - Acharya: ఆచార్య కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు...

  • whatsapp icon

Mahesh Babu - Acharya: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన "లాహే లాహే" వంటి పాటలు బాక్సాఫీస్ వద్ద సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ సినిమా నుంచి "భలే భలే బంజారా" అనే పాట లిరికల్ వీడియోని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆచార్య సినిమాలో క్యామియో పాత్ర కోసం ముందుగా మహేష్ బాబుని సంప్రదించారు దర్శకనిర్మాతలు. కానీ ఆ తర్వాత చిరంజీవితో రామ్ చరణ్ తెరపై కనిపిస్తే ఇంకా బాగుంటుందని అనుకున్న దర్శక నిర్మాతలు ఆ తర్వాత మహేష్ బాబు స్థానంలో రామ్ చరణ్ ను తీసుకున్నారు.

అయితే కొరటాల, చరణ్ తో తన స్నేహం మరియు మెగాస్టార్ పై ఉన్న గౌరవం తో మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News