OTT Releases This Week (Dec 30 To Jan 5): కొత్తేడాదికి కొత్త మూవీస్‌తో వెల్‌కమ్‌ చెప్పండి.. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌..!

OTT Releases This Week (Dec 30 To Jan 5): కొత్తేడాదికి ఇంకా రెండు రోజులే ఉంది. మరో రెండు రోజుల్లో 2025 ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం.

Update: 2024-12-30 05:38 GMT

OTT Releases This Week (Dec 30 To Jan 5): కొత్తేడాదికి కొత్త మూవీస్‌తో వెల్‌కమ్‌ చెప్పండి.. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌..!

OTT Releases This Week (Dec 30 To Jan 5): కొత్తేడాదికి ఇంకా రెండు రోజులే ఉంది. మరో రెండు రోజుల్లో 2025 ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో మరి కొత్త సంవత్సరం ప్రారంభంలో వినోదాన్ని పంచేందుకు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి. మరి న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పేందుకు వస్తున్న ఆ ప్రాజెక్ట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* న్యూఇయర్ కానుకగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న చిత్రం మార్కో. ఉన్ని ముకుందన్‌ హీరోగా హనీఫ్‌ దర్శకత్వంలో వచ్చి మార్కో మూవీ మలయాళంలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం రూ. 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. 80 కోట్లు రాబట్టింది. జనవరి 1న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.

* డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోన్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ ‘ఆల్‌ వీ ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మెచ్చిన ఈ సిరీస్‌ జనవరి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* ఇక నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా అవిసీ (డాక్యుమెంటరీ) డిసెంబరు 31, డోంట్‌ డై (హాలీవుడ్‌)జనవరి 01, మిస్సింగ్‌ యే (వెబ్‌సిరీస్‌) జనవరి 01, రీ యూనియన్‌ (హాలీవుడ్‌) జనవరి 01, లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 01, సెల్లింగ్‌ ది సిటీ (వెబ్‌సిరీస్‌) జనవరి 03, వెన్‌ ది స్టార్స్‌ గాసిప్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 04వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

* అమెజాన్‌ ప్రైమ్‌లో గ్లాడియేటర్‌2 (హాలీవుడ్‌) జనవరి 01, ది రిగ్‌ (వెబ్‌సిరీస్‌)జనవరి 02, గుణ (హిందీ) జనవరి 03వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

* ఇక మనోరమా మ్యాక్స్‌ ఐ యామ్‌ కథలన్‌ (మలయాళం) జనవరి 01వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

* తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా జొల్లీ ఓ జింఖానా (తమిళ) డిసెంబరు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* బుక్‌ మై షో వేదికగా క్రిస్మస్‌ ఈవ్‌ ఇన్‌మిల్లర్స్‌ పాయింట్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 30 నుంచి అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News