దిల్ రాజు కి షాక్ ఇచ్చిన కమల్ హాసన్
*దిల్ రాజు కి షాక్ ఇచ్చిన కమల్ హాసన్
Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం "భారతీయుడు 2" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. "విక్రమ్" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్ హాసన్ కోసం చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు "భారతీయుడు 2" సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమాని సంయుక్తంగా నిర్మించడానికి రంగంలోకి దిగారు. నిజానికి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది.
కానీ సినిమా కోసం వెచ్చిస్తున్న బడ్జెట్ చాలా ఎక్కువగా ఉందని అనిపించడంతో దిల్ రాజు సినిమా నుంచి తప్పుకున్నారట. కమల్ హాసన్ కి ఉన్న స్టార్ డంకి ఆ రేంజి బడ్జెట్ ఎక్కువవుతుంది అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.నిజానికి లైకా ప్రొడక్షన్స్ వారు కూడా మొదట అదే అనుకున్నారు కానీ కమల్ హాసన్ "విక్రమ్" సినిమాతో సాధించిన స్టార్ డం మీద నమ్మకంతో "భారతీయుడు 2" పై ఆశలు పెట్టుకున్నారు.
నిజానికి ఈ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన విక్రమ్ సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తూ కమల్ హాసన్ ని మళ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఈ నేపథ్యంలో "భారతీయుడు 2" సినిమాకి గాను మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా దిల్ రాజు మాత్రం "భారతీయుడు 2" వంటి జాక్పాట్ సినిమాని నిర్మించలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు.