Keerthy Suresh: పోస్టర్లతో ఆకట్టుకుంటున్న మహానటి

Keerthy Suresh: ఆశలన్నీ మహేష్ బాబు పై నే పెట్టుకున్న కీర్తి సురేష్

Update: 2022-02-10 14:30 GMT
Heroin Keerthy Suresh Impresses with Posters | Tollywood News Today

పోస్టర్లతో ఆకట్టుకుంటున్న మహానటి 

  • whatsapp icon

Keerthy Suresh: వరుసగా నేను శైలజ, మహానటి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ లు అందుకోవడంతో టాలీవుడ్ లో కీర్తి సురేష్ సక్సెస్ ని ఎవరూ ఆపలేరని అభిమానులు ఆనంద పడ్డారు. కానీ ఆ తర్వాత వరుసగా ఊహించనటువంటి డిజాస్టర్ లతో కీర్తి సురేష్ సతమతమవుతోంది. ఓటిటి లో విడుదలైన ఆమె సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా లు డిజాస్టర్లుగా మారాయి. ఇక ఈ మధ్యనే విడుదలైన "గుడ్ లక్ సఖి" సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వెలవెలబోయింది.

థియేటర్లలో విడుదలైన 15 రోజులకే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "సర్కారు వారి పాట" సినిమా పైనే పెట్టుకుంది కీర్తి సురేష్. తాజాగా విడుదలైన చిత్ర పోస్టర్లలో ఈమెను చూసి అభిమానులు కొంచెం సంతోషించారు. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎంతవరకు హిట్ అందుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా బ్లాక్బస్టర్ అయితే కీర్తి సురేష్ కి మరిన్ని ఆఫర్లు కూడా వచ్చి పడే అవకాశాలు లేకపోలేదు.

Tags:    

Similar News