సోషల్ మీడియా ద్వారా పూరికి శుభాకాంక్షలు చెప్పిన హీరో రామ్

సోషల్ మీడియా ద్వారా పూరికి శుభాకాంక్షలు చెప్పిన హీరో రామ్

Update: 2022-09-29 12:30 GMT

సోషల్ మీడియా ద్వారా పూరికి శుభాకాంక్షలు చెప్పిన హీరో రామ్

Ram Pothineni: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ తాజాగా తన పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రిటీలు మరియు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వివరాల్లోకి వెళితే ఒక హీరో మాత్రం తన శుభాకాంక్షలు తో అందరి దృష్టిని ఆకర్షించారు.

ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని. రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "ఇస్మార్ట్ శంకర్" ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఎంతమంది ఎంతోమంది స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ కు ఈ ఏడాది అంత భారీ స్థాయిలో శుభాకాంక్షలు అందలేదని వార్తలు వినిపిస్తున్నాయి.దానికి కారణం మహేష్ బాబు అమ్మగారు ఇందిరాదేవి ఇవాళ బుధవారం నాడు ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో అభిమాన డైరెక్టర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటం మహేష్ బాబు మనసు నచ్చుకునే విధంగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ రామ్ మాత్రం తనకి ఫేవరెట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ కూడా ఒకరని సోషల్ మీడియాలో చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇక ప్రస్తుతం రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కబోతోంది. మరి ఆ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News